- ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ డిమాండ్
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ (AIBSS) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు. మియాపూర్‌లోని నడిగడ్డ తండాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంజారాల కోసం సంత్ సేవాలాల్ తన జీవితాన్నే త్యాగం చేశారని అన్నారు. ఆయన జయంతి అయిన ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు. అదే రోజున నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, బంజారా నాయకులు హాజరు అవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు భోగ్ బండార్ పూజా కార్యక్రమం ఉంటుందిన, అనంతరం బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతినాయక్, హనుమానాయక్, సీతారాం నాయక్, రత్న కుమార్, ఆంజనేయులు, మధునాయక్, లక్ష్మణ్ నాయక్, హరి నాయక్, మోతీరాంనాయక్, చందు, గోపి నాయక్, రవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
