శేరిలింగంపల్లి, జనవరి 7 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగ సందర్భంగా కె పి హెచ్ బి కాలనీ రమ్య గ్రౌండ్ శ్రీ శివశక్తి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసెస్ ప్రొప్రైటర్ జి.ఎల్.ఎన్ రెడ్డి , నితీష్ కన్స్ట్రక్షన్ ప్రొప్రైటర్ టి.సి.హెచ్ గాలి రెడ్డి సౌజన్యంతో మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో 101 మంది మహిళలు పాల్గొన్నారు. ముగ్గులు వేసిన మహిళలకు నగదు బహుమతులు అందజేశారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.5వేల నగదును అందివ్వగా, రెండో బహుమతిగా రూ.4వేలు, 3వ బహుమతిగా రూ.3వేలు, 4వ బహుమతి కింద రూ.2వేలు ఇచ్చారు. అలాగే 5వ బహుమతిగా రూ.1వేయిని అందించారు. ఈ కార్యక్రమంలో ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి కెపిహెచ్‌బి ఎస్ఐ వి. మౌనిక రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవ్వగా న్యాయ నిర్ణయితలుగా సర్దార్ పటేల్ నగర్ కేకేఆర్ గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్వేత పాతూరి, కెపిహెచ్‌బి రవీంద్ర భారతి స్కూల్ డీన్ శిరీష మండవ వ్యవహరించారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివశక్తి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా నరసింగరావు, ఉపాధ్యక్షుడు ఉప్పల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కాముని నర్సింహారెడ్డి, ట్రెజరర్ జాలారి శివ నారాయణ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసిరెడ్డి లక్ష్మీనారాయణ, ఏవి రమణారెడ్డి, రమ్య గ్రౌండ్ బృంద సభ్యులు, అయినంపూడి శివ సత్యనారాయణ, షేక్ సత్తార్, కొల్లా శంకర్, అకనంబట్టు కుమార్ రెడ్డి, మోర్ల రామకృష్ణ, యలమంచిలి వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు, ముప్పాళ్ళ సాంబశివరావు, యంపరాల సాంబశివరావు, బండారుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






