శేరిలింగంప‌ల్లిలో గురువారం విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని ప‌లు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ర‌హ‌దారుల పక్క‌న విద్యుత్ వైర్ల‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గించ‌డం జ‌రుగుతుంద‌ని, అలాగే నిర్వ‌హ‌ణ ప‌నుల‌ను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని, క‌నుక విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు. ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు మియాపూర్ ఎక్స్ రోడ్డు 33/11 కేవీ స‌బ్ స్టేష‌న్ 11 కేవీ ద‌త్త‌సాయి ఫీడ‌ర్ ప‌రిధిలో పీజేఆర్ ఎన్‌క్లేవ్‌, ఆదిత్య‌న‌గ‌ర్‌, దత్త న‌గ‌ర్‌, బాలాజీ న‌గ‌ర్‌, వీక‌ర్ కాల‌నీ, అరబిందో కాల‌నీల్లో విద్యుత్ ఉండ‌ద‌ని తెలిపారు. అలాగే మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంట‌ల వ‌ర‌కు 33/11 కేవీ మ‌దీనాగూడ స‌బ్ స్టేష‌న్ 11 కేవీ జేపీ న‌గ‌ర్ ఫీడ‌ర్ ప‌రిధిలో నాగార్జున ఎన్‌క్లేవ్‌, విశ్వ‌నాథ్ గార్డెన్ ప్రాంతాల్లో క‌రెంటు ఉండ‌ద‌ని అన్నారు. వినియోగ‌దారులు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఏర్ప‌డే అంత‌రాయాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here