సామ వెంక‌ట్‌రెడ్డి నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన‌ శేరిలింగంప‌ల్లి హ‌స్తం నేత‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసిన తెలంగాణ రాష్ట్ర మినిమ‌మ్ వేజెస్ బోర్డు చైర్మ‌న్ సామ వెంక‌ట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ నేత‌లు వారి ఆలోచ‌న‌ను అభినందిస్తూ పార్టీలోకి స్వాగ‌తం ప‌లికారు. డిల్లీ నుంచి న‌గ‌రానికి చేరుకున్న సామ వెంక‌ట్‌రెడ్డిని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌యక‌ర్త ర‌ఘునంధ‌న్ రెడ్డి ఆద్వ‌ర్యంలో ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు క‌ల‌సి అభినంద‌న‌లు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘునంద‌న్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మంలో మొద‌టి నుంచి అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డిన సామ వెంక‌ట్ రెడ్డి లాంటి నేత‌ల‌కే టీఆర్ఎస్ పార్టీలో గౌర‌వం లేదంటే ఇక సామ‌న్య కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏంట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏదేమైన త‌న పుట్టిన‌రోజు కానుక‌గా తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌న‌కు క‌ట్టుబ‌డిన సోనియా గాంధీ నేతృత్వంలో ప‌నిచేసేందుకు సామ వెంక‌ట్ రెడ్డి నిర్ణ‌యించుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ పార్టీ నేత‌లంతా వారికి సాద‌రంగా స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంటెస్టెడ్ కార్పొరేట‌ర్లు ఇలియాస్ ష‌రీఫ్‌, రేణుక‌, నాగేష్‌, యూత్ కాంగ్రెస్ నేత జాస్ప‌ర్ రాజ‌న్ సీనియర్ నాయకులు అయాజ్ ఖాన్, జహాంగీర్, ఖాజా, ప్రలిత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సామ వెంకట్ రెడ్డిని స‌న్మానిస్తున్న శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ ర‌ఘునంద‌న్ రెడ్డి త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here