నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రంగారెడ్డి అర్భన్ జిల్లా మేధావుల సెల్ కన్వీనర్‌గా నియమితులైన తునికి రాఘవేందర్‌రావు శుక్రవారం శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు నందకుమార్ యాదవ్, ఎం.రవికుమార్ యాదవ్, రంగారెడ్డి అర్భన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రాఘవేందర్ రావుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లాలోని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, తమ అందరి సంపూర్ణ మద్ధతు ఎల్లవేళల ఉంటుందని బరోసా కల్పించారు.

