సేల్స్ ఫోర్స్ మల్టీ నేషనల్ కంపెనీ సేవ‌లు అభినంద‌నీయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉన్న‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేల్స్ ఫోర్స్ మల్టీ నేషనల్ కంపెనీ సౌజన్యంతో CSR ఫండ్స్ రూ.10,00,000 తో నిర్మించిన అదనపు తరగతి గ‌దిని ముఖ్యఅతిథిగా పాల్గొని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సేల్స్ ఫోర్స్ మల్టీ నేషనల్ కంపెనీ వారు పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సామజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. సమాజం కోసం ఏదో చేయాలనే తపన వలన సమాజ హితం జ‌రుగుతుంద‌న్నారు.

త‌ర‌గ‌తి గదిని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో సేల్స్ ఫోర్స్ సంస్థ ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ సుదీప్ కంచెర్ల, శ్రీనివాస్ చీదేళ్ల సీనియర్ డైరెక్టర్, చంద్ర సమల్ల డైరెక్టర్, పాండురంగరావు సీనియర్ మేనేజర్, స్వప్న తాటికొండ ప్రోగ్రాం మేనేజర్, భగవాన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు PSRK భగవాన్, నాయకులు సంజీవ రెడ్డి, ఎర్ర లక్ష్మ‌య్య, చంద్రమోహన్ సాగర్, MD ఇబ్రహీం, రవి సాగర్, నాగరాజు, గంగాధర్ సాగర్, రాములు సాగర్, వెంకటేశ్వర సాగర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here