శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని అఖిల భారత వెనుకబడిన వర్గాల విద్యార్థి సంఘం (AIOBCSA) హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ నాగమణి (అసోసియేట్ ప్రొఫెసర్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, హైదరాబాదు విశ్వవిద్యాలయం), పరిగి నియోజకవర్గము కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ విద్యకు స్థానం లేని చోట అక్షరం అనే పదం నిషేధించబడిన చోట బడుగు బలహీన వర్గాలకు విద్య లేనిదే వివేకం రాదని గ్రహించి, నాటి కరుడుగట్టిన సామాజిక వ్యవస్థ గీతను ఎడమకాలితో చెరిపివేసి అక్షరానికి పునాదులు వేసిన గొప్ప వ్యకక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో AIOBCSA జాతీయ అధ్యక్షుడు జి. కిరణ్ కుమార్, కార్యదర్శి వసుమతి యాదవ్, అభినేష్, సాయి కిరణ్, ఇతర ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.