నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సకాలంలో పూర్తి చేసిన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ అభినందించారు. మియాపూర్ డివిజన్ పరిధిలో నమోదు చేసిన 7600 సభ్యత్వ నమోదు పత్రాలను డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఎమ్మెల్యే గాంధీకి అందజేశారు. శేరిలింగంపల్లి డివిజన్ నుంచి పూర్తి చేసిన 4 వేల సభ్యత్వ నమోదు పత్రాలను డివిజన్ టీఆర్ఎస్ యువనేత రాగం అనిరుధ్ యాదవ్ గాంధీకి అందజేశారు. మాదాపూర్ డివిజన్ నుంచి స్థానిక నాయకులు బ్రిక్ శ్రీను, గుమ్మడి శ్రీనివాస్, గచ్చిబౌలి డివజన్ నుంచి నాయకులు నరేష్, జగదీష్‌లు పార్టీ సభ్యత్వ నమోదు పత్రాలను ఎమ్మెల్యే గాంధీకి అందజేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, కేసీఆర్ పరిపాలనపై విశ్వాసంతో ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వచ్చారని అన్నారు. సాదారణ సభ్యత్వాలతోపాటు నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వాల జోరు కొనసాగిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆదేశాల మేరకు శేరిలింగంపల్లిలో పార్టీ సభ్యత్య నమోదు విజయవంతంగా చేపట్టామని అన్నారు. ఇదే స్పూర్తితో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శ్రేణులకు గాంధీ పిలుపునిచ్చారు.