నమస్తే శేరిలింగంపల్లి: మహిళా సంరక్షణ సమితి ఫౌండర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శ్రావణీ రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి యువసేన అధ్యక్షులు ఆశిల శివ మంగళవారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్, రంగారెడ్,మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణి దేవిని ప్రకటించిన నేపథ్యంలో చేవెళ్లలో పలు రంగాలకు చెందిన గ్రాడ్యుయేట్ వివరాలను ఎంపీ రంజిత్ రెడ్డి వారు అందజేశారు. దీంతో స్పందించిన ఎంపి వెంటనే వారితో ఫోన్లో మాట్లడి మొదటి ప్రాధాన్యత ఓటు సురభి వాణీదేవికి వేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలంతా ఇదే విధంగా ముందుకు వచ్చి గ్రాడ్యూయేట్స్‌ను సంప్రదిస్తే వాణీదేవి భారీ మెజారిటీ సొంతం చేసుకుంటుందని రంజిత్‌రెడ్డి ఆశాబావం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలు సురభి అజితను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నితీష్ తదితరులు పాల్గొన్నారు.