నమస్తే శేరిలింగంపల్లి: నాగర్జున సాగర్‌లో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య యాదవ్ కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. నోముల నర్సింహయ్య యాదవ్ అకాల మరణం చాలా బాధాకరమని, ఆ నియోజకవర్గం ప్రజలకు తీరని లోటని అన్నారు. నిరంతరం ప్రజల హక్కులకై పోరాటం చేసిన మహనీయులు, తెలంగాణ రాష్ట్రం సాధనకై ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి నోముల నర్సింహయ్య యాదవ్ అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం వల్లనే ఆ నియజకవర్గం ప్రజలకు న్యాయం జరుగుతుందని, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.