శేరిలింగంపల్లి, డిసెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): సాయి ఈశ్వర చారి మరణం ప్రభుత్వ హత్య అని బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు అన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రి వద్ద రోడ్డుపైన బైఠాయించి నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, BC SC ST JAC డా.విషారదన్ మహారాజ్, బిసి పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్, కన్వీనర్స్ ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ మాట్లాడుతూ ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హత్యనే అని అన్నారు. ఈ హత్యకు నైతిక బాధ్యత వహించి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాయి ఈశ్వర చారి కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం వెంటనే చెల్లించడమే గాక వారి కుటుంబంలో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. సాయి ఈశ్వర చారి మరణం పట్ల తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ బైరు శేఖర్, నాగభూషణ్, బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నాగేష్ గౌడ్, విశ్వకర్మ నాయకులు కృష్ణమాచారి, బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ గోపి, మధుసూదన చారి, గడ్డమీద విజయ్ కుమార్ గౌడ్, హర్షవర్ధన్, అవ్వారు వేణు, రాఘవేందర్ ముదిరాజ్, దామోదర్ గౌడ్, సల్వాచారి పాల్గొన్నారు.





