సగరుల సమస్యలను పరిష్కరించండి -మంత్రి హరీష్ రావుకు రాష్ట్ర సగర సంఘం వినతి

నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ రాష్ట్రంలో సగరులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ కోరింది. గురువారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్, టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సగరల సమక్షంలో రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నాయకులు కలిసి సమస్యలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి ‘డి’ లో ఉన్న సగరులను బిసి ‘ఎ’ లోకి మార్చాలని, నిర్మాణ రంగం పై ఆధారపడి జీవిస్తున్న సగరులను నిర్మాణ రంగ కార్మికులుగా గుర్తించాలన్నారు. గతంలో ఇచ్చిన జీఓ 29 ను పునరుద్దరిస్తూ సగరులకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో 15 శాతం పనులను రిజర్వేషన్ ద్వారా ధరావతు సొమ్ము లేకుండా ఇవ్వాలని కోరారు. 60 ఏళ్ల వయస్సు పైబడిన సగరులకు ఫెన్షన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సగరుల ఆత్మ గౌరవ భవనం కోసం కోకాపేటలో ముందుగా కేటాయించిన స్థలాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో సగరులకు స్థలం, నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేశారు.

మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేస్తున్న రాష్ట్ర సగర సంఘం సభ్యులు

సగరుల వినతి మేరకు మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందిస్తూ కోకాపేట స్థలం మార్చకుండా ముందు కేటాయించిన స్థలాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్ల పై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుంటామని తెలిపారు. హుజూరాబాద్ లో సగరులకు స్థలం, నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇతర సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి తో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల బిక్షపతి సగర, ఉపాధ్యక్షుడు ఎం. రాములు సంయుక్త కార్యదర్శి కొండయ్య సగర, కార్యనిర్వాహక కార్యదర్శి ఆంజనేయలు సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి సగర, కరీంనగర్ జిల్లా సంఘం అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్ సగర, ప్రధాన కార్యదర్శి నలుబాల మురళీకృష్ణ సగర, కోశాధికారి దేవునూరి శ్రీనివాస్ సగర, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్ సగర, మహబూబ్ నగర్ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షుడు మోడల ఆంజనేయులు సగర, గౌరవ సలహాదారులు మోడల నర్సింహ్మ సగర, జగద్గిరిగుట్ట సగర సంఘం అధ్యక్షుడు సంగిశెట్టి గంగాధర సగర, కోశాధికారి వేముల సుదర్శన్ సగర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here