శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): బి ఆర్ ఎస్ పార్టీ తలపెట్టిన ఛలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావును కూకట్ పల్లి పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా బస్ ఛార్జీలు పెంచిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమైన తమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. మహిళలకు ఫ్రీ బస్ అని ఆ భారం అంతా పురుషుల మీద పెంచి ప్రజలపై భారం మోపే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి అవమానమని పేర్కొన్నారు.






