నమస్తే శేరిలింగంపల్లి: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్ బీ ఆర్ కాంప్లెక్స్, ఇంద్రా నగర్, జేపీఎన్ నగర్ కాలనీలలో కోటి 82 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముప్పవరపు గంగాధర్ రావు, మాధవరం గోపాల్ రావు, ప్రతాప్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, రఘునాథ్ రావు, గోపరాజు శ్రీనివాస్ రావు, మహమ్మద్ ఖాజా, వజీర్, రోజా, సుప్రజ, వరలక్ష్మి, రాజు గౌడ్, నర్సింగ్, వెంకటేశ్వరరావు, వాసు, స్వామి నాయక్, సుధాకర్, కృష్ణ, లక్పతి, రవి, శివ, జంగం మల్లేష్, కోటయ్య, నర్సింగ్ రావు, ముజిబ్, అబ్రహం, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.