నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతర ప్రక్రియగా పనిచేస్తూ పేదలకు బాసటగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప పార్క్ కాలనీ కి చెందిన రామ కృష్ణ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 90 వేల ఆర్ధిక సహాయానికి సంబంధించిన ఎల్ ఓ సీ మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. సీఎం సహాయ నిధి నిరంతరం సేవలందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్, అల్లం మహేష్, అంజలి తదితరులు పాల్గొన్నారు.
