సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్‌లో రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని విజ‌య‌వంతం చేయాలి: బాల‌గౌని బాల రాజ్ గౌడ్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఈ నెల 13వ తేదీన న‌గ‌రంలోని సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్‌లో కామారెడ్డి బీసీ డిక్ల‌రేష‌న్ – కాంగ్రెస్ గౌడ్స్‌కు ఇచ్చిన హామీల అమ‌లు అనే అంశంపై నిర్వ‌హించ‌నున్న రౌండ్ టేబుల్ స‌మావేశానికి గౌడ స‌భ్యులంద‌రూ హాజ‌రు కావాల‌ని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మ‌న్ బాల‌గౌని బాల రాజ్ గౌడ్ కోరారు. ఈ స‌మావేశంలో అఖిల‌ప‌క్ష నాయకుల‌తోపాటు రాష్ట్ర స్థాయి గౌడ‌, క‌ల్లు గీత సంఘాల నాయ‌కులు పాల్గొంటున్నార‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో ప్ర‌స్తుత క‌ర్త‌వ్యం, భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించ‌నున్నామ‌ని, గౌడ స‌భ్యులు హాజ‌రై త‌మ స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేయాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here