గోప‌న్‌ప‌ల్లి తండా వాసుల విజ్ఞ‌ప్తి మేర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌ను 80 ఫీట్ల‌కు కుదించాలి: గంగాధ‌ర్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోప‌న్‌ప‌ల్లి తండా నుంచి ముప్ప వరకు నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి కనెక్టివిటీ రోడ్డును అధికారుల‌తో క‌ల‌సి స్థానిక కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ స్థానిక ప్ర‌జ‌ల అభ్య‌ర్థ‌న మేర‌కు క‌నెక్టివిటీ రోడ్డును 100 ఫీట్ల నుంచి 80 ఫీట్ కుదించాల‌ని అధికారుల‌ను కోరారు. 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపడితే స్థానికంగా షాపులు కోల్పోవడంతో, గ్రామ‌స్థుల ఉపాధి కోల్పోతార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు విస్త‌ర‌ణ నిర్ణ‌యాన్ని పునఃప‌రిశీలించాల‌ని, 80 ఫీట్ల‌కు కుదించాల‌ని డీఈ ఫ‌నిజ‌ను కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, శ్రీ రాములు, రమేష్, ప్రభాకర్, వేణు రెడ్డి, వేణు, గోపంపల్లి తండా గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

డీఈ ఫ‌నిజ‌తో మాట్లాడుతున్న కార్పొరేటర్ గంగాధ‌ర్‌రెడ్డి, స్థానిక నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here