సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): శీతాకాలం నేపథ్యంలో తెల్లవారుజామున పొగమంచు దట్టంగా అలుముకుంటున్న కారణంగా ఇటీవలి కాలంలో పలు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల భద్రత దృష్ట్యా పలు సూచనలు చేశారు. వీటిని వాహనదారులు పాటిస్తే పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు.
* తెల్లవారుజామున రహదారి స్పష్టంగా కనిపించదు. కనుక ఆ సమయంలో ప్రయాణించడం మానుకోవాలి. సూర్యకాంతిలో రహదారి స్పష్టంగా కనిపించినప్పుడు మాత్రమే ప్రయాణించడం మంచిది.
* పొగమంచు కాంతిని వ్యాప్తి చేసి ప్రతిబింబించే చిన్న నీటి బిందువులను కలిగి ఉంటుంది, కనుక హై బీమ్ ఉపయోగించడం మానుకోవాలి.
* పొగమంచులో హై బీమ్ లైట్స్ ఉపయోగపడవు, కనుక ఇతర డ్రైవర్లకు మీరు కనిపించేలా లో-బీమ్ హెడ్ లైట్లను ఆన్ చేయాలి.
* గాలిలోని తేమ కాంతిని సృష్టించి మీ దృష్టిని ఆటంకపరుస్తుంది. విండ్ షీల్డ్ వైపర్, డీప్లాస్టర్ ఉపయోగించి దాన్ని తొలగించాలి.
* ఇతర వాహనాలకు అనుగుణంగా తగిన వేగంతో డ్రైవ్ చేయాలి. ఇతర వాహనాల నుండి తగినంత దూరం పాటించాలి. ఇది అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు ముందు ఉన్న వాహనాలకు తగలకుండా ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది.
* బ్రేక్ వేసే ముందు రియర్ వ్యూ అద్దాలు గమనించాలి.
* అత్యవసర పరిస్థితిలలో బండి ఆపవలసి ఉంటే రోడ్డుపై పార్కింగ్ చేయరాదు. బండిని ఇతర వాహనాలకు, పాదచారులకు అడ్డు లేకుండా సురక్షితమైన ప్రదేశాలలో పార్కింగ్ చేయాలి. హజార్ద్ లైట్ ఆన్ చేయాలి.
* రహదారిపై నిరంతరం నిఘా ఉంచి రహదారిపై మీరు చూడలేని ఇతర వాహనాలను నిర్ధారించడానికి మీ చెవులను జాగ్రత్తగా ఉపయోగించాలి. అందుకు డ్రైవింగ్ చేసేటప్పుడు బిగ్గర సంగీతం వినడం, సెల్ ఫోన్ ఉపయోగించడం చేయకూడదు.
* ఇతర వాహనాలకు మీ ఉనికిని తెలపడానికి క్రమానుగతంగా హార్న్ ను ఉపయోగించండి.
* వాహనంలో లౌడ్ మ్యూజిక్ ఆపివేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించవద్దు. లేన్ మార్చేటప్పుడు లేదా మలుపులు తీసుకునేటప్పుడు కిటికీలను కిందికి దించి రాబోయే ట్రాఫిక్ ను చూడాలి.
* పొగ మంచు ఎక్కువగా పడి పరిస్థితులు అనుకూలించకపోతే ప్రయాణాన్ని వాయిదా వేయండి. పరిస్థితులు మెరుగయ్యే వరకు వేచి ఉండండి.
Good infarmation Tq bro