శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆర్సీ పురం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చందానగర్ గంగారం, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు యూనిఫామ్ ధరించడం, వాహనాల్లో సైడ్ వ్యూ మిర్రర్లు కలిగి ఉండడం, అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు వెంట తీసుకెళ్లడం, అలాగే ట్రాఫిక్ నిబంధనలు, నియమాలను కచ్చితంగా పాటించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సుమారు 30 మంది ఆటో డ్రైవర్లను గంగారంలోని వాసన్ ఐ కేర్ సెంటర్ కు తీసుకెళ్లి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.






