శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు PRK చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ రత్నపోల వాణీ కోటేశ్వర్ రావు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ఆనందోత్సాహాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు పీఆర్‌కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 26 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జతమన్యు, సాయి సుజిత్ తదితరులు పాల్గొన్నారు.