శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గోపన్ పల్లి గ్రామం లోనీ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందమయంగా ఉండాలని, అద్భుతమైన విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, తెలుగు నూతన సంవత్సర శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మద్దతు,దే వుడి ఆశీస్సులతో ప్రజా సేవలో ముందుకెళ్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, బీజేపీ శ్రేణులు, భక్తులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.