శేరిలింగంపలి జోన్ లో చెత్త సేక‌ర‌ణ‌పై స‌మీక్ష స‌మావేశం

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపలి జోన్ మీటింగ్ హాల్ లో అడిషనల్ కమిషనర్ G శ్రీజన అధ్యక్షతన స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ముఖ్యంగా ఇంటి ఇంటి చెత్త సేకరణలో భాగంగా ప్రతి ఇంటి నుంచి నేరుగా చెత్త తీసుకునే కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో భాగంగా ప్రతి షాపు యజమాని ఆటో డ్రైవర్ కు చెత్త ఇచ్చే విధంగా చేయాలని లేనిచో పెనాల్టీ విధించాలి అని నిర్ణయించారు. అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సూచించారు. ఇందుకు క్షేత్రస్థాయిలో చేపట్టే పారిశుద్ధ్య చర్యలే అత్యంత ప్రధానమన్నారు. శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో ప్రధానంగా పరిశుభ్రత చర్యలను ఎలా చేయాలో సూచించారు. ఐటీ పరిశ్రమలకు శేరిలింగంపల్లి జోన్‌ వేదికగా ఉన్నందున ఆ స్థాయిలోనే రహదారుల నిర్వహణ జరగాలని, క్షేత్రస్థాయి సిబ్బంది చేపట్టే చర్యలే ఇందుకు ప్రధానమన్నారు.

స్వీపింగ్‌ అనంతరం వెంటనే చెత్త కుప్పలు తొలగించాలని, ఫ్లె ఓవర్‌లపై మట్టి ఇసుక ఇతర వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. డీసీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని, లోటు పాట్లను సవరించుకుంటూ చక్కని పరిసరాలు నెలకొనేలా చూడాలన్నారు. ప్రతి షాపు, కమర్షియల్ ఏరియా దుకాణాలలో డస్ట్ బిన్ ఏర్పాటు చేయాలి లేనిచో పెనాల్టీ పడుతుంది అని ప్రతి దుకాణం కి తెలియచేయమని చెప్పారు. ఈ మీటింగ్ లో మూడు జోన్స్ కి సంబధించిన జోనల్ కమిషనర్లు హేమంత్, అపూర్వ చౌహాన్, సందీప్ కుమార్, అన్ని జోన్స్ కి సంబంధించిన ఆల్ డిప్యూటీ కమిషనరులు, ఆల్ DE, Swms, రాంకీ సిబంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here