నాయి బ్రాహ్మణ సేవా సంఘం కోసం క‌మ్యూనిటీ హాల్‌ను నిర్మించాల‌ని విన‌తి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీని ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంఘం సభ్యులు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేయాలని విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యుల విన్నపం మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తానని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కరుణాకర్ గౌడ్, రామరాజు, శేరిలింగంపల్లి మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ సాయిలు , జనరల్ సెక్రెటరీ రవీందర్ , వైస్ ప్రెసిడెంట్ పరుశురాం , ట్రెజరర్ శేఖర్ , వైస్ చైర్మన్ మానిక్ ప్రభు , గౌరవ అధ్యక్షుడు భాస్కర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి కుమార్ , సభ్యులు విజయ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here