శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డికి అధికారులు నోటీసు జారీ చేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాలో ఆయన పేరు కె. భాస్కరరెడ్డిగా నమోదు కాగా, ప్రస్తుత ఓటర్ల జాబితాలో కసిరెడ్డి భాస్కరరెడ్డిగా నమోదై ఉండటంతో ఈ నోటీసు అందినట్లు తెలిపారు. నోటీసును స్వాగతించిన కసిరెడ్డి భాస్కరరెడ్డి.. అధికారులకు సమాధానంగా తన పాస్‌పోర్టును సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అధికారులు అడిగిన వివరాలను అందజేస్తూ, ఈ ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. తమకు సంబంధించిన వివరాలను సక్రమంగా అందజేసి, ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ SIR ప్రక్రియలో భాగస్వాములై తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అధికారులకు అవసరమైన పత్రాలు, వివరాలను అందించాలని సూచించారు.





