శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్, ఆదర్శ్ నగర్, లింగంపల్లి, బాపునగర్, చందానగర్ లో శరన్నవరాత్రుల సందర్భంగా 11 రోజుల పాటు పూజాలందుకున్న దుర్గాదేవి విగ్రహాన్ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మండప నిర్వాహకులు దుర్గామాత విగ్రహాన్ని అద్భుతంగా అలంకరించి శోభాయాత్ర నిర్వహించారు. బాజా భజంత్రీల నడుమ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు సాగింది. మహిళలు, యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అమ్మవారిని సాగనంపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డీజే స్టెప్పులు వేసి యువతలో జోష్ నింపారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న దేవీ మాత విగ్రహాల నిమజ్జన ఘట్టంలో భాగంగా కన్నుల పండువగా అంగరంగా వైభవంగా ఊరేగింపు కొనసాగుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ఐకమత్యం పెంపొందుతుందని అన్నారు. ప్రతిఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, ప్రవీణ్, నరేందర్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సుధాకర్ రెడ్డి, రవీందర్, కృష్ణ, ప్రసాద్, సత్యనారాయణ, ప్రణయ్, లింగంపల్లి భగత్ సింగ్ యూత్, ఆయా మండప ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






