శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు, శానిటేషన్ సిబ్బంది కొరత వల్ల కాలనీలో పలు ప్రదేశాల్లో చెత్త చెదారం పేర్కొందని, వీధి దీపాలు లేవని, డ్రైనేజీ ఔట్లెట్ లేక మురుగునీరు కాలనీలో నిలబడి దుర్వాసన వస్తుందని, దీని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలోని సమస్యలపై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కార్పొరేటర్‌ను కోరామని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ హామీ ఇచ్చారని భేరి రామచందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకుడు జోషి రాఘవేంద్ర శర్మ, చిట్టెమ్మలాల్ రెడ్డి, జయ రెడ్డి, రాధా రాణి రెడ్డి పాల్గొన్నారు.






