శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): నందిగామలో ఉన్న గౌడ హాస్టల్ కు కేటాయించిన నిధులను మంజూరు చేయాలని కోరుతూ హాస్టల్ కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గౌడ హాస్టల్ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.1 కోటి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని గౌడ హాస్టల్ అధ్యక్షుడు మోతే చక్రవర్తి గౌడ్, ఉపాధ్యక్షుడు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, సంయుక్త కార్యదర్శి పి అశోక్ గౌడ్, దౌడ హాస్టల్ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందజేయగా మంత్రి ఇందుకు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే నిధులు విడుదల అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.