శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ పోచమ్మ ఆలయం రోడ్డులో నీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ వాటర్ బోర్డు జీఎంకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జలమండలి జీఎంకి మెమొరాండం సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ స్థానికంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, లైన్మెన్ శివ నీటి సరఫరా సరిగ్గా ఇవ్వట్లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు నీటిని సరిగ్గా సరఫరా చేసి సమస్యను తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జిల్లా మహిళ అధ్యక్షురాలు బండారి విజయలక్ష్మి, గుల్ల వాసుకి, నీలవేణి, అనిత, దుర్గమ్మ, లక్ష్మీ, రంగమ్మ, నవీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






