శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర సలహాదారు బేరి రామచందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమ ఆర్థిక అభివృద్ధి కోసం మినీ పాల డైరీలు ఏర్పాటుచేసి యాదవ కార్పొరేషన్ ద్వారా యాదవ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం ఉన్న గొల్ల కురుమలకు రాజకీయ రంగంలో జనాభా ప్రతిపాదికన ప్రకారం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి జడ్పీ చైర్మన్లు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో శివ ముదిరాజ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, కృష్ణ యాదవ్, రవి యాదవ్, రాజేష్, కుమారి, గొల్ల కురుమలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకి గొల్ల కురుమ సమస్యలపై వినతి పత్రం అందించారు.