శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నేతాజీ నగర్ కాలనీలో అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ సాయిబాబా ఆలయ కమిటీ హాల్ నుండి నల్లగండ్ల చెరువు నాలా వరకు లేదన్నారు. కనుక త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని కోరారు. కాలనీలో పలు చోట్ల సిసి రోడ్లు, ఓపెన్ నాలాలు భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటికి త్వరగా మరమ్మత్తులు చేయించాలని, కాలనీ నుండి మురుగునీరు వెళ్లడానికి అవుట్ లెట్ కూడా లేదని అన్నారు. ఔట్‌లెట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుల్‌మోహర్ పార్క్ అధ్యక్షుడు షేక్ ఖాసిం, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, జయ రెడ్డి, రాధా రాణి రెడ్డి, గంగమ్మ, చిట్టెమ్మ లాల్ రెడ్డి, మౌలానా, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






