శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ కాలనీ, లక్ష్మీ విహార్ ఫేజ్ 1, నల్లగండ్ల హుడా కాలనీ, డైమండ్ హైట్స్, TNGOS కాలనీ, నానక్ రామ్ గూడ , రాయదుర్గంలో అర్బన్ స్కై Panache అపార్ట్మెంట్ నుండి నాలా వరకు , ఖాజాగూడ కాలనీలలో రూ. 5 కోట్ల 42 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాలువ నిర్మాణం పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాలువ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన , అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






