దోపిడీ విద్యా విధానానికి వ్య‌తిరేకంగా ఏఐఎస్ఎఫ్ పోరాటం: ధర్మ తేజ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అఖిల భారత విద్యార్థి సమాఖ్య‌ Aisf 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని శేరిలింగంపల్లి మండలం కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి ధర్మ తేజ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ భారతదేశ కోసం పిడికిలి బిగించి స్వాతంత్య్రం మా జన్మ హక్కు అని దేశం కోసం పోరాడిన విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం మొట్టమొదటి విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య‌ ఏఐఎస్ఎఫ్ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చ‌ని అన్నారు. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ఆజాద్ లాంటి ఎందరో అమర వీరుల ఆశయ సాధన కోసం బబ్రుద్దిన్, ప్రేమ్ నారాయణ భార్గవ్ నాయకత్వాన ఆవిర్భవించడం జరిగింద‌న్నారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణ, శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం అమలుపై నిరంతరం పోరాటం సాగిస్తుంద‌న్నారు. ఈ దోపిడీ విద్యా విధానంకి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ పోరాడుతుందని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here