మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తమ తండా వాసులపై సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్పడుతున్న ఆగడాలకు అడ్డు కట్ట వేయాలని కోరుతూ మియాపూర్‌లోని నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం చాంద్రాయణగుట్టలోని సీఆర్‌పీఎఫ్ డీఐజీ రేంజ్ డిప్యూటీ కమాండంట్ ఆఫీసర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తండాలో గత నలభై సంవత్సరాలుగా పేద ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని, తమ తండా వద్ద చెక్‌పోస్టున ఏర్పాటు చేసిన సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆఫీసర్ త్వరలోనే తండాను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, రెడ్యానాయక్, తుకారం నాయక్, మధు నాయక్, రత్నకుమార్ పాల్గొన్నారు.
