కొండాపూర్‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతా: కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బస్తీలలో, కాలనీలలో ప్రతి సమస్యను పరిష్కరించి, ప్రతి చోట మెరుగైన వసతులు కల్పించి, కొండాపూర్ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి పరచి, ఆదర్శ డివిజన్ గా తీర్చి దిద్దే దిశగా కృషి చేస్తున్నామని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.

సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో ఆంజనేయ స్వామి గుడి వీధి లో రూ.50 లక్షల అంచనా వ్యయంతో కొన‌సాగుతున్న సీసీ రోడ్ల పనులను, అంజయ్య నగర్ పోచమ్మ గుడి వెనుక వీధిలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను, రాఘవేంద్ర కాలనీ ఎ బ్లాకులోని ప్రకృతి నిలయం అపార్ట్మెంట్స్ వీధిలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను, రాఘవేంద్ర కాలనీ బి బ్లాకులోని నవ్య నివాస్ అపార్ట్మెంట్స్ వీధిలో రూ.45 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను సోమవారం అర్ధరాత్రి కార్పొరేటర్ హమీద్ ప‌టేల్ ప‌రిశీలించారు.

ఈ సందర్బంగా హమీద్ పటేల్ కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల మ్యాన్ హోల్స్ ఎత్తును పెంచిన తర్వాతే సమాంతరంగా రోడ్లను వెయ్యాలని, కాలనీలోని, బస్తీలలోని ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పనులను చేయించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. యూత్ నాయకులు దీపక్, కరీం, అస్లాం, రియాజ్, ప్రవీణ్, బాలు, భాస్కర్, వెంకటేష్, మల్లికార్జున్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here