కూకట్ పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ గారి సమక్షంలో భోజన విరామ సమయంలో రెండవ రోజు కూకట్ పల్లి, కొండాపూర్ డివిజన్ ఆఫీస్ ఆవరణలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, TVW B-2871 యూనియన్, CITU ల ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. చాలా రోజుల నుండి పరిష్కారం కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో TSEE యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు, సైబర్ సిటీ సర్కిల్ సెక్రెటరీ హెచ్ శ్యామ్ సుందర్, TVW B-2871 యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాదర్, CITU యూనియన్ పరుశురాం, గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ వై. వెంకట రామిరెడ్డి, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్, కొండాపూర్ డివిజన్ సెక్రెటరీ రాజేందర్ నాయక్, కూకట్‌పల్లి డివిజన్ ప్రెసిడెంట్ రామ్ చందర్, కూకట్‌పల్లి డివిజన్ సెక్రెటరీ ఎస్. రమేష్, గచ్చిబౌలి డివిజన్ సెక్రెటరీ బి. దుర్గాప్రసాద్, కూకట్‌పల్లి డివిజన్ సెక్రెటరీ ఎం.బాల సిద్దు, ఎం. మల్లేష్ పాల్గొన్నారు.