హెచ్‌ఎంటీ – జేపీ నగర్ రోడ్‌లో వీధి దీపాలు ఏర్పాటు చేయాల‌ని విన‌తి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ లోని హెచ్‌ఎంటీ నుండి జేపీ నగర్ వరకు మెయిన్ రోడ్‌లో వీధి దీపాలు ఏర్పాటు చేయాల‌ని కోరుతూ మియాపూర్ స‌ర్కిల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ శ‌శిరేఖ‌కు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మియాపూర్ డివిజన్ అధ్య‌క్షుడు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ శ‌నివారం విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మియాపూర్ సర్కిల్ పరిధిలోని హెచ్‌ఎంటీ నుండి జేపీ నగర్ వరకు ఉన్న మెయిన్ రోడ్‌లో వీధి దీపాలు తగిన విధంగా లేవ‌ని, దీని వల్ల రాత్రి సమయంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. అలాగే చీకటి కారణంగా ప్రమాదాలు, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉంద‌న్నారు. అందువల్ల ఆ మెయిన్ రోడ్‌లో అవసరమైన చోట్ల కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయించి, పనిచేయని లైట్లను వెంటనే మరమ్మత్తులు చేయించాల‌ని కోరారు. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ నాయ‌కుడు గుండె గ‌ణేష్ ముదిరాజ్‌, జాజార శ్రీ‌నివాస్‌, కాల‌నీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here