శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని చాకలి చెరువు వద్ద ఉన్న దోబీఘాట్ ను పునర్నిర్మాణం చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆరెకపుడి గాంధీకి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి తెరాస పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి వీరేశం గౌడ్, ఈశ్వర రజక సంఘం అధ్యక్షుడు సి.హనుమంతు, ఉపాధ్యక్షుడు డి.అశోక్, జనరల్ సెక్రటరీ టి. భీమేష్, జాయింట్ సెక్రటరీ సి.మున్ని స్వామి, టి.వెంకటేష్, కోశాధికారి సి.పరుశురాం, కార్యవర్గ సభ్యులు సీహెచ్ సురేష్, సి.సంజీవ్, కమిటీ సభ్యులు సి.తిమ్మయ్య, టి.జనార్దన్, సి.ప్రతాప్ కుమార్, టి.రాజు, సి.రామాంజనేయులు, సీహెచ్.కృష్ణ, సి.రాము, డి.మోహన్ పాల్గొన్నారు.






