మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ లో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సోమవారం సందర్శించారు. కోవిడ్ అనంతరం పాఠశాల ప్రారంభం అయిన నేపథ్యంలో పాఠశాలను సందర్శించి ఆయన అందులో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు కార్పొరేటర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన మాట్లాడుతూ ఆయా సమస్యలను త్వరలోనే ప్రభుత్వ విప్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పాఠశాల హెడ్ మాస్టర్ చిరంజీవి, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.






