శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ మదీనాగూడ గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనను వైభవంగా నిర్వహించిన నిర్వాహకులు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్, అనూష యాదవ్, మల్లేష్, రమేష్, సురేష్, వెంకటేష్ , ఆంజనేయులు, బీరప్ప, బాలరాజు , కుమార్, శివ, చిన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






