శేరిలింగంపల్లి, మే 29 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి వార్డు కార్యాలయంలో వృద్ధాప్య, వితంతువు, దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వ రూపొందించిన చేయూత యాప్లో నమోదు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ఫోటోలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. పెన్షన్ లబ్ధిదారులు తమ వివరాల నమోదుకు సంబంధిత పత్రాలతో వార్డు కార్యాలయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి సర్కిల్ కమ్యూనిటీ ఆర్గనైజర్ వి.ఆర్.కె. పాప గౌడ్, రిసెర్చ్ పర్సన్ జానకి తదితరులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.






