శేరిలింగంపల్లి, మే 29 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు, మాదాపూర్ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ జన్మదినం, వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన నివాసంలో ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి కలిసి గంగల రాధాకృష్ణ యాదవ్‌ను శాలువాతో సత్కరించి, గజమాల వేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగల రాధాకృష్ణ యాదవ్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న అంకితభావం కలిగిన నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి సేవలు అందిస్తూ, కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజాసేవలో నిత్యం ప్రజల కోసం శ్రమిస్తున్న ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి పార్టీకి, సమాజానికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాదాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం గంగల రాధాకృష్ణ యాదవ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, పార్టీకి ఆయన చేస్తున్న కృషి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, వరలక్ష్మీ ధీరజ్, సీనియర్ నాయకులు సుమన్, శ్రీధర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.





