నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్తీ వాసులు స్థానికంగా నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డికి వివరించారు. ప్రధానంగా డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాల సమస్యలను గుర్తించిన కార్పొరేటర్ వాటిని పరిష్కరించాలంటూ ఏఈ కృష్ణవేణికి సూచించారు. అదేవిధంగా బస్తీ దవఖానా పెండిగ్ పనులను పూర్తిచేయాలని, దవఖానాను పరిశుభ్రంగా ఉంచి స్థానికులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, గిరిజన మోర్చా (రంగారెడ్డి అర్బన్) జిల్లా అధ్యక్షులు హనుమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
