నిరుపేద‌ల వైద్యానికి ముఖ్య‌మంత్రి స‌హ‌యానిధి నుంచి రాజీలేని స‌హ‌కారం: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: నిరుపేద‌ల వైద్యం విష‌యంలో ఎక్క‌డా రాజీలేకుండా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి నుంచి సహాయం అందుతుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంప‌ల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన పది లక్షల యాభై మూడు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావుల‌తో కలిసి గాంధీ బాదిత కుటుంబాల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా క‌ల్గిస్తుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నరేంద్ర చారి, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, నాయ‌కులు వాలా హరీష్ రావు, గుడ్ల ధ‌న‌ల‌క్ష్మీ, ల‌క్ష్మీనారాయణ, మిద్దెల మల్లారెడ్డి, పోతుల రాజేందర్, సైదేశ్వర్, కృష్ణ ముదిరాజ్‌, వెంకటేష్ యాదవ్, విమల, స్వప్న, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద‌ల వైద్యానికి ముఖ్య‌మంత్రి స‌హ‌యానిధి నుంచి రాజీలేని స‌హ‌కారం: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

చెక్కులు అందుకున్న‌ ల‌బ్ధిదారులు వీరే…
1.హఫీజ్పెట్ డివిజన్ ఓల్డ్ హఫీజ్పెట్ కి చెందిన సవిత కి 1,04,000/-
2. శేరిలింగంపల్లి డివిజన్ తార నగర్ కి చెందిన లింగయ్య కి-56,000/-
3.మియాపూర్ డివిజన్ ఎంఏ నగర్ కి చెందిన రామకోటేశ్వర్ రావు-60,000/-
4.కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కి చెందిన సుశీల కి -60,000/-
5.కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీ కి చెందిన శ్రీనివాస్ కి -60,000/-
6.ఆల్విన్ కాలనీ డివిజన్ శివమ్మా కాలనీ కి చెందిన యాసిర్ ఆలీకి -60,000/-
7. కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ కి చెందిన రమేష్ కి -60,000/-
8.ఆల్విన్ కాలనీ డివిజన్ జయనగర్ కి చెందిన వెంకట్ రెడ్డి కి -60,000/-
9.వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ కి చెందిన ప్రియాంక కి 60,000/-
10.గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గాకి చెందిన రాఘవ చార్యులు కి -44 ,000 /-
11.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 కి చెందిన చంద్రయ్య కి -54,000/-
12. హఫీజ్పెట్ డివిజన్ ప్రకాష్ నగర్ కి చెందిన మాధవికి -56,000/-
13.వివేకానంద నగర్ డివిజన్ సుమిత్ర నగర్ కి చెందిన వెన్నయ్య కి -56,000/-
14.హఫీజ్పెట్ డివిజన్ సాయి నగర్ కి చెందిన కైరు హున్నిసా బేగం కి -38,000/-
15.కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ కి చెందిన బాల్ రాజు కి 17,000/-
16.వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ కి చెందిన రామకృష్ణ కి -17,000/-
17.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమబండ కి చెందిన చిన్నయ్య కి-36,000/-
18.కొండపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ కి చెందిన సుధాకర్ 17,500/-
19.గచ్చిబౌలి డివిజన్ దర్గా కి చెందిన అనూష కి 52,000/-
20.కూకట్పల్లి డివిజన్ ప్రగతి నగర్ కి చెందిన లక్ష్మీకి -16,000/-
21.కూకట్పల్లి డివిజన్ ఆస్బె స్టాస్ కాలనీ కి చెందిన నర్సింగ రావు -12,000/-
22.హఫీజ్పెట్ డివిజన్ గంగారాం కి చెందిన దినేష్ కి -46,500/-
23.ఆల్విన్ కాలనీ డివిజన్ దత్తాత్రేయ కాలనీ ఎల్లమ్మబండ కి చెందిన అనూష కి-29,000/-
24.శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ కి చెందిన షేక్ మౌలానా కి -36,000/-

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here