శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకి తెరాస రాష్ట్ర నాయకుడు రవీందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆమెను బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రవీందర్ యాదవ్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.






