ప్ర‌జ‌ల‌కు మెరుగైన వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి

  • ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

చందానగర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వర్గం ప్ర‌జ‌ల‌కు మెరుగైన మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. మంగ‌ళ‌వారం చందానగర్ డివిజన్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో సుమారుగా రూ.7 కోట్ల అంచనా వ్యయం తో చేపట్టనున్న‌పలు అభివృద్ధి పనులకు ఆయ‌న స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డితో క‌లిసి శంకుస్థాప‌న‌లు చేశారు.

అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

దీప్తి శ్రీ నగర్ లో రూ.138.50 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ), సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, కైలాష్ నగర్, వేముకుంటల‌లో రూ.32.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల‌కు, ఫ్రెండ్స్ కాలనీ లో రూ.53.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) ఆర్‌సీసీ ఎన్‌పీ3 (600 ఎంఎం డ‌యా) పైప్ లైన్ నిర్మాణ పనుల‌కు, తారానగర్ లో రూ.39.60 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, దీప్తి శ్రీ నగర్ లో రూ.70.80 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, చందానగర్ భారత్ పెట్రోల్ బంక్ నుండి ఇంటి నంబర్ 5-80/2 వరకు రూ.16.90 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, చందానగర్ ఇంటి నంబర్ 5-80/2 నుండి ఇంటి నంబర్ 5-76/2 వరకు రూ.13.60 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, చందానగర్ రాయల్ మండి నుండి పీఆర్‌కే హాస్పిటల్ వరకు రూ.28.40 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, అన్నపూర్ణ ఎన్‌క్లేవ్, గౌతమి నగర్ లో రూ.32.60 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) ఆర్‌సీసీ ఎన్‌పీ3 (450 ఎంఎం డ‌యా) పైప్ లైన్, సీసీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, శంకర్ నగర్ , భవానిపురం లో రూ.23.60 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్లు, సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, సిటిజెన్ కాలనీ లో రూ.39.70 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, జవహర్ కాలనీ లో రూ.40.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనుల‌కు, తారానగర్ ఇండేన్ గ్యాస్ గోడౌన్ వద్ద ప్రధాన నాలా పై (ప్రీతీ హాస్పిటల్ దగ్గర) రూ.1 కోటి 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డీఈ రూప దేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు జగదీష్, శ్రీధర్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రాఘవేందర్ రావు , మోహన్ గౌడ్, సునీత రెడ్డి, డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు మిరియాల రాఘవ రావు, ఉరిటి వెంకట్రావు, దాసరి గోపి, జేరిపాటి రాజు, జనార్దన్ రెడ్డి, ప్రవీణ్, ప్రసాద్, కొండా విజయ్, నరేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ రెడ్డి, మిరియాల ప్రీతమ్, గురు చరణ్ దుబే, అక్బర్ ఖాన్, వజిర్, గోవర్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఓ.వెంకటేష్, సంజీవ రెడ్డి, గుడ్ల ధనలక్ష్మి, శ్రీకాంత్ రెడ్డి, విజయ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here