- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ లో పూర్తి చేసిన 40 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి హాఫీజ్‌పేట్ డివిజన్ తెరాస సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి, హైదర్ నగర్ డివిజన్ తెరాస సీనియర్ నాయకులు కోనేరు ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో తెరాస నాయకులు వాలా హరీష్ , ఎంవీ ప్రసాద్ పాల్గొన్నారు.

