శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ మంత్రి హరీష్ రావును శేరిలింగంపల్లి యువనేత, భారాస సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ పరామర్శించారు. కోకాపేట్ లోని క్రిన్స్ విల్లాలోని ఆయన నివాసంలో కలిసి రవీందర్ యాదవ్ ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. ఇటీవల తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన రవీందర్ యాదవ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని వెల్లడించారు. అలాగే హరీష్ రావు సోదరుడు మహేష్ ను సైతం కలిసి సానుభూతిని తెలిపారు.






