శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం పద్మశ్రీ పురస్కార గ్రహీత, సహస్ర అవధాని డాక్టర్ గరికపాటి నరసింహారావుచే ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






