శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల గుంటూరులో ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ ఇంటర్ డిస్ట్రిక్ట్ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 2 బంగారు, 2 సిల్వర్ పతకాలను సాధించిన మాజీ సైనికుడు సీతారామయ్యను PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, శర్మ, గుమ్మడి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.






