నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. చందానగర్ డివిజన్ నుండి కూకట్ పల్లి బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అడ్వకేట్ ఆదిత్యను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తూ రవికుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ లో బిజెపి బలోపేతానికి మరింత కృషి చేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రఘు, మల్లేశ్, శివ రత్నాకర్, నరసింహా, సాయి, మురళి తదితరులు పాల్గొన్నారు.